Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమల ఖాళీ... డైరెక్ట్ గా దర్శనం!

  • తిరుమలలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు
  • అనూహ్యంగా తగ్గిన భక్తుల రద్దీ
  • దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం

ఓవైపు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పడిపోయింది. కనీసం ఒక్క కంపార్టుమెంటులోనైనా భక్తులు దర్శనం కోసం వేచి చూడటం లేదు. వచ్చిన భక్తులను వచ్చినట్టుగా దర్శనానికి పంపుతున్నారు. ఉచిత దర్శనానికి కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇది కూడా క్యూలైన్ లో నడిచి వెళ్లి, స్వామిని దర్శనం చేసుకుని బయటకు రావడానికి మాత్రమే పట్టే సమయం.

ఇక, టైమ్ స్లాట్, నడక దారి భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న భక్తులకు గంట వ్యవధిలోనే దర్శనం పూర్తవుతోంది. బుధవారం నాడు హుండీ ద్వారా రూ. 2.65 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఉదయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

  • Loading...

More Telugu News