nawaz sharif: నవాజ్ షరీఫ్ ను విడుదల చేయండి.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం!

  • షరీఫ్, ఆయన కుమార్తె మరియంలను విడుదల చేయాలన్న ఇస్లామాబాద్ హైకోర్టు
  • వీరు చట్టాలను ఉల్లంఘించలేదన్న కోర్టు
  • అవినీతి డబ్బుతో నివాసాలను కొన్నారనడానికి సాక్ష్యాలు లేవు

అవినీతి కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. అవెన్ ఫీల్డ్ కేసులో షరీఫ్ తో పాటు ఆయన కూతురు మరియంను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. వీరితో పాటు షరీఫ్ అల్లుడు సఫ్దార్ కూడా విడుదల కానున్నారు. జస్టిస్ అథర్ మినల్లా, జస్టిస్ మియంగుల్ హసన్ ఔరంగజేబ్ ల ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఇప్పటికే షరీఫ్ భార్య కుల్సుం అంత్యక్రియల నిమిత్తం షరీఫ్, మరియంలు పెరోల్ పై విడుదలయ్యారు.

అవెన్ ఫీల్డ్ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన కేసును హైకోర్టు రద్దు చేసింది. చట్టాలను వీరు ఉల్లంఘించలేదని, అవినీతి డబ్బుతో విలాసవంతమైన నివాసాలను కొన్నారనడానికి సరైన సాక్ష్యాధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు షరీఫ్ కు 11 ఏళ్లు, మరియంకు 8 ఏళ్ల శిక్షను విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News