akhil: ఆసక్తిని రేపుతోన్న 'మిస్టర్ మజ్ను' ఫస్టులుక్

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 
  • షూటింగు దశలో 'మిస్టర్ మజ్ను'
  • జనవరి 26న రిలీజ్ చేసే ఛాన్స్

అఖిల్ తాజా చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. 49 సెకన్ల వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. ఒక సాంగ్ బిట్ .. ఒక డైలాగ్ పై ఈ వీడియో ను కట్ చేశారు.

"దేవదాసు మనవడు .. మన్మథుడికి వారసుడు .. కావ్యములో కాముడు .. అంతకన్నా రసికుడు .. "అంటూ ఈ సాంగ్ సాగుతోంది. "దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు" అనే అఖిల్ డైలాగ్ ఈ వీడియోలో చోటు చేసుకుంది. కొత్త లుక్ తో కనిపిస్తూ అఖిల్ ఆకట్టుకుంటున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

  • Loading...

More Telugu News