vikram: 'సామి స్క్వేర్' సెన్సార్ పూర్తి .. రిలీజ్ కి అంతా సిద్ధం

  • హరి దర్శకత్వంలో 'సామి స్క్వేర్'
  • సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ 
  • ఈ నెల 21వ తేదీన విడుదల      

విక్రమ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'సామి' ఒకటిగా కనిపిస్తుంది. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ఈ సినిమా, అప్పట్లో విక్రమ్ కెరియర్ కి ఎంతో హెల్ప్ అయింది. అలాంటి ఈ సినిమాకి అదే దర్శకుడు సీక్వెల్ చేశాడు. 'సామి స్క్వేర్' పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని 'సామి' పేరిట తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ సరసన ఒక కథానాయికగా కీర్తి సురేశ్ .. మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాబీసింహా విలన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.    

More Telugu News