triple talak: ఇస్లాంలో వివాహం అనేది ఒక సివిల్ కాంట్రాక్ట్: కేంద్రంపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

  • ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్ ఇది 
  • ముస్లిం మహిళలకు దీని వల్ల ఎలాంటి న్యాయం చేకూరదు 
  • సమాన హక్కులను కేవలం ముస్లింలకు మాత్రమే వర్తింపజేయాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం

ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో ముస్లిం మహిళలకు ఎలాంటి న్యాయం చేకూరదని ఆయన అన్నారు. ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్ ఇది అని చెప్పారు.

 ఇస్లాంలో వివాహం అనేది ఒక సివిల్ కాంట్రాక్ట్ వంటిదని... ఇందులోకి ప్యానెల్ ప్రొవిజన్లను తీసుకురావడం చాలా తప్పని అన్నారు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని కేవలం ముస్లింలకు మాత్రమే వర్తింపజేయాలనుకోవడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ను ముస్లిం పర్సనల్ లా బోర్డు, మహిళా సంస్థలు సవాలు చేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News