YSRCP: రోడ్లపై నాట్లు వేసిన రోజా.. తెలుగుదేశం ప్రభుత్వంపై వినూత్న నిరసన!

  • చిత్తూరు జిల్లా నగరిలో ఘటన
  • సీఎం, లోకేశ్ పై విమర్శలు
  • జెడ్పీ సమావేశంలో ప్రస్తావించినా పట్టించుకోలేదని మండిపాటు

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అధ్వాన స్థితిపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ వినూత్నంగా నిరసన తెలిపింది. చిత్తూరు జిల్లాలోని నగరిలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లపై ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పడంతో రోజా ఈ రోజు మేళపట్టు గ్రామానికి చేరుకున్నారు. అనంతరం బురదమయంగా మారిన రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ నేత, జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇక రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారైతే.. మంత్రి లోకేశ్ ఏమో లక్షల కిలోమీటర్లు రోడ్లు వేసినట్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. గ్రామాల్లోకి వచ్చి ప్రజా సమస్యలను వినే ధైర్యం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ నేతలెవరికీ లేదన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఈ సమస్యను పలుమార్లు ప్రస్తావించినా ఎవ్వరూ పట్టించుకోలేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News