Anantapur District: ప్రబోధానంద బలవంతుడు.. అందుకే నాపై దాడిచేశాడు!: జేసీ దివాకర్ రెడ్డి

  • ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన జేసీ
  • ఆశ్రమంలో అక్రమాలపై వీడియోలు, ఆధారాల అందజేత
  • చంద్రబాబు ఏ విషయాన్నీ తేల్చిచెప్పరని విమర్శ

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయ్యారు. చిన్నపొడమల గ్రామంలో ప్రబోధానంద స్వామి వర్గీయులకు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణ విషయమై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా ఘర్షణ చోటుచేసుకున్న తీరును, పోలీసుల వ్యవహారశైలిని జేసీ చంద్రబాబుకు వివరించారు. అనంతరం సచివాలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రబోధానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఏ సమస్యపై అయినా చంద్రబాబు తొందరగా తేల్చి చెప్పరని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్య ఉందా? లేదా? అన్న విషయాన్ని హోంమంత్రి చినరాజప్పనే అడగాలని మీడియాకు సూచించారు. తాను చెప్పాల్సిన విషయాలు చంద్రబాబుకు చెప్పేశానని దివాకర్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News