Miryalaguda: ఊరించిన మారుతీరావు ఆఫర్... చావు బతుకుల మధ్య ఉన్న కుమారుడి చికిత్స కోసం ఓకే చెప్పిన అస్గర్!

  • ఒక హత్య చేస్తే లక్షల్లో డబ్బు
  • అప్పటికే ఆసుపత్రిలో కుమారుడు, చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు
  • హత్యకు సహకరిస్తానని ఒప్పుకుని భాగమైన అస్గర్
ఒక్క హత్య చేస్తే, లక్షల్లో డబ్బు వస్తుంది... కుమారుడిని బతికించుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఈ ఆలోచన ఒక్కటే ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసిన మారుతీరావు మాయలో అస్గర్ ను పడేలా చేసింది. ఒక హత్య చేస్తే, కోటి రూపాయలు వస్తాయని తెలుసుకున్న అస్గర్, అప్పటికే ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో ఉన్న కుమారుడి చికిత్సకు అవసరమయ్యే డబ్బు కోసం ఇందులో భాగం అయ్యాడు. మారుతీరావు ఇచ్చిన ఆఫర్ కు టెంప్ట్ అయ్యాడు.

వాస్తవానికి గుజరాత్ మాజీ హోమ్ మంత్రిని హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన అస్గర్ కు, ప్రణయ్ ని హత్య చేయడం చాలా చిన్న విషయం. అప్పట్లో జీహాదీ మత్తులో ఉన్న అస్గర్ సాహసం చేసినా, జైలుకు వెళ్లి వచ్చిన తరువాత మరొకరి ప్రాణాలను తీసేందుకు ఎన్నడూ ప్లాన్ చేయలేదని పోలీసులు గుర్తించారు. అయితే, మహ్మద్ బారీ నుంచి ఆఫర్ వచ్చిన తరువాత మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఈ కేసులో తాను ప్రాణాలు తీయబోనని, అయితే, హత్యకు సహకరించి, దగ్గరుండి పని చేయిస్తానని హామీ ఇచ్చి, కుట్రలో ఇరుక్కుని, చివరకు మరోమారు జైలు పాలయ్యాడు.
Miryalaguda
Honor Killing
Asghar
Maruti Rao
Murder

More Telugu News