Triple Talak: మోదీ సర్కారు సంచలన నిర్ణయం... ట్రిపుల్ తలాక్ ను బ్యాన్ చేస్తూ ఆర్డినెన్స్!

  • ఈ ఉదయం సమావేశమైన క్యాబినెట్
  • తలాక్ చెప్పడం శిక్షించతగ్గ నేరమే
  • ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విడుదల

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ, ఈ విధానంలో భార్యకు విడాకులు ఇవ్వడాన్ని శిక్షించదగ్గ నేరంగా మారుస్తూ, ఆర్డినెన్స్ తెచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నాడు సమావేశమైన క్యాబినెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం పలుకుతూ, కార్యనిర్వాహక ఉత్తర్వులను వెలువరించింది. ట్రిపుల్ తలాక్ బిల్లు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలోనే, ఆర్డినెన్స్ తేవాలని మోదీ క్యాబినెట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లును మరోసారి పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి పంపాలని పలు విపక్ష పార్టీలు డిమాండ్ చేయడంతో బిల్లు చర్చల దశలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News