Andhra Pradesh: ఏపీ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను నాలుగు నెలల ముందే ప్రకటిస్తాం!: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు!

  • గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి
  • ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పనులకు శంకుస్థాపన
  • 175 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ల కేటాయింపుపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పుల్లారావు.. పలు అంశాలపై ముచ్చటించారు.

అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందుగానే చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగినట్లుగా చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ఉండబోదని స్పష్టం చేశారు. ఈసారి 175 సీట్లలోనూ టీడీపీ పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు.
Andhra Pradesh
Guntur District
assembly elections
ntr
statue
MLA

More Telugu News