Chittoor District: వాయల్పాడు సీఐపై సీఎం చంద్రబాబు గుస్సా.. క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశం!

  • వివాహితను వేధించిన సీఐ తేజోమూర్తి
  • బాధితురాలికి అండగా ఉంటామని హామీ
  • ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసిన డీఐజీ

చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సీఐ తేజోమూర్తి లైంగిక వేధింపుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. బాధితురాలికి తన ప్రభుత్వం అండగా ఉంటుందనీ, భయపడవద్దని సూచించారు. తేజోమూర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను సీఎం ఆదేశించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

తనకు తెలియకుండా భర్త రెండో వివాహం చేసుకోవడంపై మదనపల్లెకు చెందిన సంయుక్త అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బాధితురాలిపై కన్నేసిన స్టేషన్ సీఐ తేజోమూర్తి తన కోరిక తీర్చాలని వేధించాడు. తిరుమల కొండపై తాను విధులు నిర్వహిస్తున్నాననీ, వస్తే ఇద్దరం కలసి ఎంజాయ్ చేద్దామని ఒత్తిడి చేశాడు. ఈ వేధింపులు హద్దులు దాటడంతో సంయుక్త మహిళా సంఘాలతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆడియో, వీడియో, సందేశాల రికార్డులను పరిశీలించిన డీఐజీ శ్రీనివాస్ తేజోమూర్తిని సస్పెండ్ చేశారు.

More Telugu News