stock market: చైనాపై మళ్లీ సుంకాలు విధించిన అమెరికా.. వరుసగా రెండో రోజు కుదేలైన మార్కెట్లు!

  • ప్రభావం చూపిన పెట్రో ధరలు, రూపాయి విలువ
  • 294 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 20 శాతం వరకు నష్టపోయిన దేనా బ్యాంక్

నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు... ఈరోజు కూడా కుదేలయ్యాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా మళ్లీ సుంకాలు విధించడంతో... దాని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. దీనికి తోడు అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, పతనమవుతున్న రూపాయి విలువ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 294 పాయింట్లు పతనమై 37,290కి పడిపోయింది. నిఫ్టీ 98 పాయింట్లు కోల్పోయి 11,278కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
దేనా బ్యాంక్ (19.75%), బజాజ్  కార్ప్ (7.18%), యూకో బ్యాంక్ (6.98%), కార్పొరేషన్ బ్యాంక్ (6.19%), జ్యోతి లేబొరేటరీస్ (5.21%).    

టాప్ లూజర్స్:
బ్యాంక్ ఆఫ్ బరోడా (-16.03%), బలరాంపూర్ చీనీ మిల్స్ (-11.33%), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-9.11%), ఇండియన్ బ్యాంక్ (-8.33%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-8.07%).  

More Telugu News