sekhar kammula: మరో ప్రేమకథను తెరకెక్కించనున్న శేఖర్ కమ్ముల

  • టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్న  ధృవ్
  • ఏషియన్ గ్రూప్ నిర్మాణ సారధ్యంలో సినిమా
  • పూర్వ నిర్మాణ పనులు పూర్తి
చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ త్వరలో టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ధృవ్‌ని తెలుగు తెరకు పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేపట్టినట్టు కొన్ని రోజుల క్రితం గుసగుసలు వినిపించాయి. కానీ, దీనిపై నేటి వరకూ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఏడాది క్రితం 'ఫిదా' సినిమా ద్వారా అద్భుతమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించిన శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. తాజాగా ఆయన మరో ప్రేమకథను తెరకెక్కించనున్నారని స్పష్టమైంది.

అయితే ఈ చిత్రంలో హీరో ధృవేనా? లేదంటే మరొకరా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాను ఇప్పటి వరకూ పంపిణీ, ప్రదర్శన రంగాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఏషియన్ గ్రూప్ నిర్మించనుంది. ఈ సంస్థకు ఇది తొలి సినిమా. ఇప్పటికే ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలనూ త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహనరావు తెలిపారు.
sekhar kammula
chiyan vikram
dhruv
fida

More Telugu News