Rahul Gandhi: రాహుల్ కర్నూల్ పర్యటనలో వీహెచ్‌ను అడ్డుకున్న పోలీసులు!

  • కర్నూలులో పర్యటించిన రాహుల్
  • వీహెచ్‌ను అడ్డుకున్న పోలీసులు
  • నొచ్చుకున్న వీహెచ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో తనకు అవమానం జరిగిందని వి.హనుమంతరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిన్న మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ఆయన, నేడు ఏపీలోని కర్నూలు పట్టణంలో పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా కర్నూలులోని కిసాన్ ఘాట్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధికి పూలమాల వేసి రాహుల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెనుక వెళుతున్న వీహెచ్‌ను కిసాన్ ఘాట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నొచ్చుకున్న ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పర్యటనలో పలు చోట్ల తనను ఆయన వెంట వెళ్లనీయకుండా పోలీసులు అవమానపరిచారని వీహెచ్ అలకబూనారు.
Rahul Gandhi
vh
Congress

More Telugu News