ali: సమంతను నాకు పరిచయం చేసింది పవన్ కల్యాణ్ గారే: అలీ

  • అలీ గారిని చూడగానే నవ్వొచ్చేసేది 
  • సెట్లో పవన్ తో కలిసి జోకులు వేసేవారు
  • ఆయన నా ఫేవరేట్  

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. అల్లరి ప్రశ్నలను ఆమెపై సంధించిన అలీ, సమంతతో తనకి గల పరిచయాన్ని గురించి ప్రస్తావించారు. "సమంతను నాకు పరిచయం చేసింది .. పవన్ కల్యాణ్ గారు. పొల్లాచ్చిలో 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగు జరుగుతూ ఉండగా, 'అలీ గారూ .. సమంత .. పరిచయమేనా?' అని పవన్ గారు అడిగారు. 'లేదండి' అంటే .. 'అలీ గారనీ .. బాగా రిచ్ ' అని సమంతకు చెబుతూ నన్ను ఆమెకి పరిచయం చేశారు" అన్నారు అలీ. దాంతో సమంత నవ్వుతూ ..  'నాకు అలీగారు అంటే చాలా ఇష్టం .. సెట్లో ఆయనను చూడగానే నవ్వొచ్చేసేది. 'అత్తారింటికి దారేది'లో ఆయనతో కలిసి నటించాను .. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ ఒక పిక్ నిక్ లా సాగిపోయింది .. అందుకు కారకులు అలీ. ఆయన పవన్ కల్యాణ్ గారిపై ఒక జోక్ వేస్తే .. ఆయనపై పవన్ గారు ఒక జోక్ వేసేవారు ..  దాంతో సెట్లో నవ్వులే నవ్వులు. ఈ సినిమా తరువాత అలీ నా ఫేవరేట్ అయిపోయారు" అని అన్నారు.   

  • Loading...

More Telugu News