pranay: ప్రణయ్ ను నరికి చంపిన హంతకుడి గుర్తింపు.. బీహార్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • ప్రణయ్ ను హతమార్చిన వ్యక్తి బీహార్ కు చెందినవాడు
  • పేరు సుభాష్ శర్మ
  • సమస్తిపూర్ జిల్లాలో సుభాష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
మిర్యాలగూడలో ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా నరికి చంపిన హంతకుడిని పోలీసులు గుర్తించారు. బీహార్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమృత తండ్రి మారుతీరావు నుంచి సుపారీ తీసుకుని ప్రణయ్ ను హతమార్చిన వ్యక్తి పేరు సుభాష్ శర్మ. ఇతను బీహార్ కు చెందిన వ్యక్తి. ప్రణయ్ ను హతమార్చిన వెంటనే మిర్యాలగూడ నుంచి బీహార్ కు వెళ్లిపోయాడు. నల్గొండ నుంచి వెళ్లిన పోలీసులు బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనిని బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. ఈ సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
pranay
murder
miryalaguda
matuthi rao
murderer
bihar

More Telugu News