Shital Mahajan: ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెప్పేందుకు 13 వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన స్కై డైవర్

  • మోదీకి వెరైటీగా విషెస్ చెప్పిన శీతల్ మహాజన్
  • చేతిలో ప్లకార్డుతో కిందికి దూకిన స్కై డైవర్
  • వచ్చే ఎన్నికల్లోనూ మోదీ గెలవాలని ఆకాంక్ష
భారత ప్రధాని నరేంద్రమోదీకి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా స్కై డైవర్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నిన్న 68వ బర్త్ డేను జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శీతల్ మహాజన్ అనే స్కై డైవర్ ఏకంగా 13 వేల అడుగుల పై నుంచి మోదీకి విషెస్ చెప్పారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శీతల్ విమానం నుంచి కిందికి దూకారు. చేతిలో మోదీకి విషెస్ చెబుతున్న ప్లకార్డు ఉంది. ఆమె సహచర స్కై డైవర్ సుదీప్ కొడవటి ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ సందర్భంగా శీతల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
Shital Mahajan
Maharashtra
Narendra Modi
Birthday
Skydiver

More Telugu News