IDBI: రూ. 12,885 కోట్ల అప్పులు చెల్లించలేక దివాలా తీసిన జీవీకే పవర్ లిమిటెడ్!

  • ఐడీబీఐ బ్యాంకు నుంచి రుణం
  • తిరిగి చెల్లించడంలో విఫలం
  • నేడు లా ట్రైబ్యునల్ ముందుకు పిటిషన్

జీవీకే పవర్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థగా, విద్యుత్ ఉత్పత్తి రంగంలో సేవలందిస్తున్న జీవీకే పవర్ (గోయింద్వాల్ సాహిబ్) లిమిటెడ్ దివాలా తీసినట్టు తెలుస్తోంది. తమ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైందని ఆరోపిస్తూ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఐడీబీఐ బ్యాంకు ఆశ్రయించనున్నట్టు సమాచారం. నేడు హైదరాబాద్ బెంచ్ ముందుకు ఐడీబీఐ పిటిషన్ రానుండగా, ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్టసీ కోడ్, సెక్షన్ 7 కింద విచారణ జరగనుంది. వాదనల అనంతరం జీవీకే పవర్ దివాలా తీసినట్టు లా ట్రైబ్యునల్ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 కాగా, ఐడీబీఐ బ్యాంకు నుంచి జీవీకే పవర్ తీసుకున్న రుణం, వడ్డీతో కలిపి గడచిన ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 12,885 కోట్లకు చేరింది. పంజాబ్ లోని తరన్ జిల్లా సమీపంలోని గోయింద్వాల్ సాహిబ్ గ్రామంలో రెండు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను జీవీకే పవర్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల అభివృద్ధి నిమిత్తం పొందిన రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతోనే ఐడీబీఐ బ్యాంకు దివాలా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది.

More Telugu News