Sri Lanka: పేలవమైన ఆటతీరుతో ఆసియా కప్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన శ్రీలంక!

  • ఆఫ్గనిస్థాన్ చేతిలో ఘోర పరాజయం
  • 91 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి
  • నేడు భారత్ - హాంకాంగ్ మధ్య మ్యాచ్

బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్... ఈ రెండు క్రికెట్ కూనల దెబ్బకు శ్రీలంక తలవంచి ఆసియా కప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన జట్టు, తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఏమాత్రం అనుభవం లేని ఆఫ్గనిస్థాన్ పైనా చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్‌ 249 పరుగులకు ఆలౌట్ కాగా, పెద్ద కష్టం కాని 250 పరుగుల లక్ష్య ఛేదనలో, 41.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై శ్రీలంక ఓడిపోయింది.

దీంతో చెరో విజయంతో గ్రూప్‌ 'బి' నుంచి బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌ సూపర్‌–4 దశకు అర్హత సాధించాయి. కాగా, నేడు భారత జట్టు హాంకాంగ్ తో తన తొలి మ్యాచ్ లో తలపడనుంది. ఆపై రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోటీపడనుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఏది గెలిచినా, సూపర్ -4కు భారత్ అర్హత సాధిస్తుంది. 

More Telugu News