Rahul Gandhi: మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్.. మతాచార్యుల ఆశీస్సులు!

  • రాహుల్‌కు 11 మంది మతాచార్యుల ఆశీర్వాదం
  • మధ్యప్రదేశ్‌ను దక్కించుకోవాలన్న పట్టుదల
  • రాహుల్‌కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 11 మంది మతాచార్యులను కలుసుకుని ఆశీర్వాదం పొందారు. ఉదయం భోపాల్ విమానాశ్రయంలో దిగిన రాహుల్‌కు కాంగ్రెస్ నేతలు కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఘన స్వాగతం పలికారు. ఓ వైపు రాహుల్‌ను శివ భక్తుడిగా పేర్కొంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, మరోవైపు 'రాహుల్ జిందాబాద్' నినాదాలతో నగరం హోరెత్తింది.

ఈ సందర్భంగా రాహుల్‌ను కలిసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పోటీ పడ్డారు. రోడ్డు పక్కన సమోసా, టీ తీసుకునేందుకు రాహుల్ కొద్దిసేపు ఆగడంతో ఆయన అనుచరులకు సెల్ఫీ దిగేందుకు అవకాశం దొరికింది. మధ్యప్రదేశ్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ పాగా వేసింది. ఇప్పుడు దాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. 
Rahul Gandhi
kamalanath
jyothiraditya sindhiya

More Telugu News