Narendra Modi: మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి: మోదీకి రాహుల్ శుభాకాంక్షలు

  • నేడు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న నరేంద్ర మోదీ
  • ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రాహుల్
  • ప్రధానికి పలువురి శుభాకాంక్షలు
నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచారు. "మన ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అన్నారు. కాగా, నేడు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోదీకి పలువురు ప్రముఖులు, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి విషెస్ తెలిపారు.
Narendra Modi
Rahul Gandhi
birthday
Wishes
Twitter

More Telugu News