pranay: వేలాది మంది అశ్రునయనాల మధ్య పూర్తయిన ప్రణయ్ అంత్యక్రియలు!

  • కన్నీటితో తుది వీడ్కోలు పలికిన అమృత
  • అంత్యక్రియలకు తరలి వచ్చిన వేలాది మంది
  • ప్రణయ్ అమర్ రహే అంటూ నినాదాలు
మిర్యాలగూడలో పరువుహత్యకు గురైన ప్రణయ్ అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అశ్రునయనాల మధ్య అంతిమ కార్యక్రమం పూర్తయింది. బంధువులు, స్నేహితులు, వివిధ ప్రజాసంఘాల నేతలు భారీ ఎత్తున అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రణయ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

భార్య అమృత, తమ్ముడు అజయ్, తల్లిదండ్రులు ప్రణయ్ కు కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. మరోవైపు ప్రణయ్ పార్థివదేహానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ, గాయకుడు గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ రాములు నాయక్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తదితరులు నివాళులు అర్పించారు.
pranay
amrutha
miryalaguda

More Telugu News