Kadiam Srihari: తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి: కడియం శ్రీహరి

  • తెలంగాణ బాహుబలి కేసీఆర్ మాత్రమే
  • దళితుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మళ్లీ అవినీతి పురుడు పోసుకుంటుంది
రాజకీయాల్లో బాహుబలి ఒక్కరే ఉంటారని... తెలంగాణలో అది ఒక్క కేసీఆర్ మాత్రమేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రేగొండలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా గెల్చుకునే సత్తా బీజేపీకి లేదని ఎద్దేవా చేశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని... బీజేపీ పాలనలో దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దారుణమని... చంద్రబాబు తీరుతో దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ మళ్లీ ఏకమవుతున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అవినీతి మళ్లీ పురుడు పోసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా పాల్గొన్నారు.
Kadiam Srihari
kct
Chandrababu
ntr
congress
bjp
TRS

More Telugu News