modi: 'పెట్రో' ధరల పెరుగుదలతో మోదీకి కష్టాలు తప్పవు!: రాందేవ్ బాబా

  • పెరుగుతున్న పెట్రో ధరలు మోదీ కొంప ముంచుతాయి
  • పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
  • గాడ్ ఫాదర్స్ లేకపోయినా.. నేను ఈ స్థాయికి ఎదిగా

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకాశాన్నంటుతున్న ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఏదో ఒకటి చేయకపోతే... మోదీకి కష్టాలు తప్పవని హెచ్చరించారు. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి, 28 శాతం శ్లాబ్ కింద ఉంచాలని ఆయన సూచించారు. పన్నుల్లో తనకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తే... పెట్రోల్, డీజిల్ ను తాను కేవలం రూ. 35 నుంచి రూ. 40కే అందిస్తానని చెప్పారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ కొన్ని మంచి పనులు కూడా చేశారని... అయితే రాఫెల్ ఒప్పందంపై కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు తలెత్తిన విషయం తెలిసిందేనని రాందేవ్ బాబా చెప్పారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా లేనని, రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. తన వెనుక గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరని... అయినా తాను ఇంత స్థాయికి ఎదిగానని చెప్పారు. డబ్బు వెనక తాను ఏ రోజూ వెళ్లలేదని... డబ్బే తన వెనక వస్తుందని అన్నారు.

More Telugu News