pranay: అమృత తండ్రి, బాబాయ్ ని ప్రజలే చంపుతారు: ప్రణయ్ సోదరుడు

  • ఇలాంటి సైకో తండ్రిని ఎక్కడా చూడలేదు
  • ప్రేమ, పెళ్లిపై కక్ష పెంచుకున్నాడు
  • కాసేపట్లో ప్రణయ్ అంత్యక్రియలు
మిర్యాలగూడలో పరువుహత్యకు గురైన ప్రణయ్ తమ్ముడు అజయ్ ఉక్రెయిన్ నుంచి మిర్యాలగూడకు చేరుకున్నాడు. అన్న మృతదేహాన్ని చూసి భోరున విలపించాడు. పక్కనే ఉన్న వదిన అమృతను పట్టుకుని కన్నీరు కార్చాడు. అజయ్ రాకతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కాసేపట్లో ప్రణయ్ అంత్యక్రియలు ప్రారంభంకానున్నాయి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అజయ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. అమృత తండ్రి, బాబాయ్ లను ప్రజలే చంపుతారని అన్నాడు. ప్రేమ, పెళ్లిపై వదిన వాళ్ల నాన్న కక్ష పెంచుకున్నారని చెప్పాడు. ఇలాంటి సైకో తండ్రిని ఎక్కడా చూడలేదని అన్నాడు. 
pranay
amruta
murder

More Telugu News