amit shah: అరెస్ట్ వారంట్ తో బీజేపీకి సంబంధం లేదన్న అమిత్ షాపై చంద్రబాబు విమర్శలు!

  • ఇప్పుడు కేంద్రంలో, మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నారు?
  • డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు
  • బ్యాంకులను దోచిన వాళ్లను విదేశాలకు పంపుతారు

బాబ్లీ కేసు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జారీ అయిన అరెస్ట్ వారెంట్ రాజకీయవర్గాల్లో వేడి పుట్టిస్తోంది. చంద్రబాబును నిర్వీర్యం చేయాలనే బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై కాంగ్రెస్ హయాంలో కేసు నమోదైందని... కోర్టు ఇచ్చిన వారెంట్ కు, బీజేపీకి సంబంధం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, వారెంట్ విషయంలో తమకు సంబంధం లేదని అమిత్ షా అన్నారని... ప్రస్తుతం కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయని ప్రశ్నించారు. రాజకీయాల కోసం డ్రామాలు ఆడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. బ్యాంకులను దోచేసిన వాళ్లను విదేశాలకు పంపిస్తారంటూ కేంద్రంపై మండిపడ్డారు.

More Telugu News