Krishna District: కృష్ణా జిల్లాలో గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. బాణసంచా పేలి ఐదుగురు చిన్నారులకు గాయాలు!

  • చందర్లపాడులో ఘటన
  • ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు
  • టపాసులు దగ్గరగా పేలడమే కారణం
కృష్ణా జిల్లాలో ఈ రోజు దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి చందర్లపాడులో గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాణసంచా కాల్చడంతో ఐదుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు వీరిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా టపాసులు పేల్చిన సమయంలో దగ్గరగా ఉండటంతో దాని తీవ్రతకు ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న ఇతర గ్రామస్తులు వీరిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, తమ పిల్లలు గాయపడటంతో చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Krishna District
nandigama
crackers

More Telugu News