bihar: జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్.. భవిష్యత్ అతనిదేనన్న నితీశ్ కుమార్!

  • ఈ రోజు పట్నాలో జేడీయూ తీర్థం
  • ముగిసిన పార్టీ కార్యవర్గ భేటీ
  • వైఎస్సార్ సీపీకి ప్రచార వ్యూహకర్త

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ రోజు ప్రశాంత్ కిశోర్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదశ్-యునైటెడ్(జేడీయూ)లో చేరారు. పట్నాలో ఈ రోజు జరిగే జేడీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన రాజకీయ చేరికను ధ్రువీకరిస్తూ ఆదివారం ఉదయం ‘బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ చేరికపై సీఎం నితీశ్ మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రశాంత్ కిశోర్ దేనని జోస్యం చెప్పారు. 2012లో గుజరాత్ ఎన్నికల్లో, 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్, అమిత్ షాతో భేదాభిప్రాయాల కారణంగా విడిపోయారు. అనంతరం మరుసటి ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి(జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్) విజయం కోసం కృషి చేశారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.  

More Telugu News