Kadiam Srihari: పెద్దాయన కదా అనే కడియంకు పాదాభివందనం!: టీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య

  • గౌరవంతోనే ఆయన ఇంటికి వెళ్లి గెలిపించాలని కోరా
  • కేసీఆర్‌ సర్వేలో నాకే అత్యధిక మార్కులు
  • టికెట్‌ ఆశించే వారుండడం తప్పులేదు
కేసీఆర్‌ చేయించిన సర్వేలో తనకు అత్యధికంగా 98 శాతం మార్కులు వచ్చాయని, కేటీఆర్‌ (91), హరీష్‌రావు (88)ల కంటే ఇది ఎక్కువనీ స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్‌ మొదటి లిస్టులో తనకు టికెట్‌ కేటాయించారని చెప్పారు. అధిష్ఠానం అనుమతివ్వడంతో ఆశీర్వాద సభలు ప్రారంభించానని తెలిపారు. ఇప్పటికే వేలేరు, లింగా, ఘనపూర్‌లో పూర్తయ్యాయని, ఆదివారం నుంచి బుధవారం వరకు స్టేషన్‌ ఘనపూర్‌, రఘునాథపల్లి, ధర్మసాగర్‌, చిలుపూరుల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇక ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కంటే వయసులో పెద్దవారని, అందుకే ఆయన ఇంటికి వెళ్లి గెలిపించాలని కోరుతూ పాదాభివందం చేశానని, అంతకు మించి దీనికి విశేషం ఏమీ లేదని ఆయన చెప్పారు. హన్మకొండ సర్య్కూట్‌హౌస్‌ వద్ద ఉన్న తన స్వగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలనగానే టికెట్‌ ఆశించేవారు ఎంతోమంది ఉంటారని, అందులో తప్పేం లేదని అన్నారు.

Kadiam Srihari
TRS
Rajaiah
Telangana

More Telugu News