Pranay: నాకు కనిపిస్తే నాన్నను నేనే చంపేస్తా... మిర్యాలగూడ సెంటర్ లో ప్రణయ్ విగ్రహం పెట్టిస్తా: అమృత వర్షిణి

  • ప్రణయ్ హత్యే ఆఖరి పరువు హత్య కావాలి
  • కుల దురహంకార హత్యలు జరుగకుండా ఉద్యమం
  • తండ్రి, బాబాయ్ లకు శిక్ష పడాల్సిందేనన్న అమృత

తన భర్తను దారుణాతి దారుణంగా హత్య చేయించిన తన తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ లకు కఠిన శిక్ష పడాల్సిందేనని, తన తండ్రి కనిపిస్తే తానే చంపేస్తానని పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఆగ్రహంతో వ్యాఖ్యానించింది. ఈ ఉదయం మిర్యాలగూడలోని ప్రణయ్ ఇంటికి వచ్చి మృతదేహం వద్ద బోరున విలపించింది.

ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన భర్త హత్యే ఆఖరి పరువు హత్య కావాలని, ఇకపై ఇటువంటి కుల దురహంకార హత్యలు జరుగకుండా ఉద్యమిస్తానని తెలిపింది. తన భర్త మరణిస్తే, తాను తిరిగి వారి వద్దకు వెళతానని తల్లిదండ్రులు అనుకొని ఉండవచ్చని, కానీ, అది ఈ జన్మకు జరగదని చెప్పింది. మిర్యాలగూడ సెంటర్ లో తన భర్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, నగరంలో కులపిచ్చి పట్టుకున్న పెద్దలకు ఈ ఘటన నిత్యమూ గుర్తొచ్చేలా చేస్తానని చెప్పింది.

  • Loading...

More Telugu News