Nokia: నోకియా కొత్త ఫోన్ వివరాలు లీక్... వెనుకవైపు 5 కెమెరాలు, భారీ బ్యాటరీ!

  • 'ఆండ్రాయిడ్ పై' సిస్టమ్ పై నోకియా 9
  • 6.01 అంగుళాల డిస్ ప్లే, 8 జీబీ రామ్
  • 4 ఎక్స్ ఆప్టికల్ జూమ్ అదనపు ఆకర్షణ

మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానున్న నోకియా కొత్త ఫోన్ 'నోకియా 9' స్పెసిఫికేషన్స్ నెట్టింట లీక్ అయ్యాయి. ఈ ఫోన్ లో 4,150 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న భారీ బ్యాటరీ ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 5 కెమెరాలు ఉంటాయని, బ్యాటరీ నాన్ రిమూవబుల్ అని సమాచారం. ఆన్ లైన్లో లీక్ అయిన ఇమేజ్ ని బట్టి, ఈ ఫోన్ నీలిరంగులో ఉన్నప్పటికీ, ఆవిష్కరణ సమయంలో కలర్ ఆప్షన్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫోన్ వెనుక భాగం చిత్రం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుండగా, ఐదు కెమెరాలు కనిపిస్తున్నాయి. గతంలో లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 'ఆండ్రాయిడ్ పై' సిస్టమ్ పై నడుస్తుందని, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.01 అంగుళాల డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 8 బీజీ రామ్, 256 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం, 41, 20, 9.7 మెగాపిక్సల్ కెమెరాలు, 4 ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఎల్ఈడీ ఫ్లాష్ తదితరాలు ఉంటాయని తెలుస్తోంది.

More Telugu News