kvp: కేంద్ర ప్రభుత్వం తప్పుడు సర్వేలు చేయిస్తోంది: కుటుంబరావు

  • రెండు నెలల వ్యవధిలో రెండు రకాల సర్వే ఫలితాలిచ్చారు
  • కర్ణాటకలో వెలువరించిన సర్వే తప్పని రుజువైంది
  • కేంద్రం ప్రోద్బలంతోనే కేవీపీ.. టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు

ఏపీ రాష్ట్రంలో పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేవంటూ ఓ మీడియా సంస్థ తన సర్వేలో వెల్లడించింది. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి తప్పుడు సర్వేలు చేయిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ యాక్సెస్ సంస్థ జూలైలో నిర్వహించిన సర్వేలో 45శాతం మంది ఓటర్లు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని పేర్కొని, సెప్టెంబర్‌కు వచ్చేసరికి తన సర్వేను మార్చేసిందని వెల్లడించారు. రెండు నెలల వ్యవధిలో రెండు రకాల సర్వే ఫలితాలను విడుదల చేసిందని విమర్శించారు. ఈ సంస్థ కర్ణాటకలో వెలువరించిన సర్వే తప్పని రుజువైందని ఆయన తెలిపారు. కేంద్రం ప్రోద్బలంతోనే టీడీపీపై కాంగ్రెస్ నేత కేవీపీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News