vijay devarakonda: ఓవర్సీస్ లో చిరూ సినిమా రికార్డును అధిగమించిన విజయ్ దేవరకొండ

  • సంచలన విజయం సాధించిన 'గీత గోవిందం'
  • ఓవర్సీస్ లో టాప్ 10లో చోటు 
  • విజయ్ కి దక్కిన అరుదైన రికార్డు  
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' .. తొలిరోజు నుంచి వరుస రికార్డులను కొల్లగొడుతూ వెళుతోంది. తాజాగా ఈ సినిమా చిరంజీవి 150వ సినిమా అయిన 'ఖైదీ నెంబర్ 150' వసూళ్లను అధిగమించి మరో రికార్డును సొంతం చేసుకుంది.

ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 చిత్రాలలో ఇప్పటివరకూ 'ఖైదీ నెంబర్ 150' ఎనిమిదవ స్థానంలో వుంది. తాజాగా ఆ స్థానాన్ని 'గీత గోవిందం' ఆక్రమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాకి ముందు 'అ ఆ' .. 'మహానటి' సినిమాలు వున్నాయి.  ఇంకా తగ్గని 'గీత గోవిందం' దూకుడు చూస్తుంటే, ముందున్న రెండు సినిమాల రికార్డులను కూడా అధిగమించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మొత్తానికి 'గీత గోవిందం' ఒక అరుదైన రికార్డునే సొంతం చేసుకుందన్న మాట.   
vijay devarakonda

More Telugu News