Chandrababu: చందబ్రాబుపై విపక్షాలది నీతిమాలిన చర్య: నక్కా ఆనందబాబు

  • జీవీఎల్‌ స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది
  • బాబ్లీ అంశంపై కేసీఆర్‌, పవన్ నోరు విప్పాలి
  • తెలంగాణ కోసమే ఆనాడు పోరాడాం

బాబ్లీ కేసును అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిపై విపక్షాలు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నాయని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఉత్తర తెలంగాణ బీడు వారుతుందనే ఆనాడు బాబ్లీపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ కేసును అడ్డు పెట్టుకుని ఎనిమిదేళ్ల తర్వాత వారెంట్లు జారీ చేయడం హాస్యాస్పదమన్నారు. వాస్తవానికి ఆ రోజు నిరసనకు వెళ్లిన తమపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. బాబ్లీ కేసుపై కేసీఆర్‌, పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. నోరు పారేసుకుంటున్న బీజేపీ ఎంపీ జీవీఎల్‌ తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ కేసులో న్యాయవ్యవస్థను గౌరవిస్తూనే తదుపరి చర్యలకు దిగుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News