Anantapur District: అనంతపురం జిల్లాలో 'సవాళ్ల'తో ఉద్రిక్తత.. వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్!

  • రాయదుర్గంలో అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ సవాళ్లు
  • గోపులాపురంలో బహిరంగ చర్చకు ఏర్పాటు
  • శాంతిభద్రతల రీత్యా అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు, వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డిలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరిగిన  అభివృద్ధిపై చర్చ కోసం కణేకల్ మండలం గోపులాపురంలో ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ సందర్భంగా ఘర్షణ చెలరేగే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు వైసీపీ నేత కాపు రామ చంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

మంత్రి కాలువ గోపులాపురం బయలుదేరుతుండగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆయనతో చర్చించారు. అక్కడికి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనీ, సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉండాలని కోరారు. ఎస్పీ విజ్ఞప్తితో మంత్రి శ్రీనివాసులు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలతో పాటు 100 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

More Telugu News