paruchuri: ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాను ఆడించదు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'నరసింహనాయుడు' నిడివి పెరిగింది
  • ఫస్టాఫ్ తగ్గించమని చెప్పాను  
  • ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర గోపాల్ అసంతృప్తి

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'నరసింహనాయుడు' సినిమాను గురించి ప్రస్తావించారు. ఈ సినిమా రష్ చూస్తే 17000 అడుగులు వచ్చింది. రష్ చూసిన తరువాత ఇది 'ఆంధ్ర షోలే' అవుతుంది అని బి. గోపాల్ కి చెప్పాను. అయితే లెంగ్త్ ఎక్కువగా వుంది కాబట్టి తగ్గించమని చెప్పాను. దాంతో ఆయన ఫస్టాఫ్ అలాగే వుంచి .. సెకండాఫ్ లో నుంచి తగ్గించి నాకు చూపించాడు.

 'సెకండాఫ్ లో ప్రతి ఫ్రేమ్ ఉండాల్సిందే .. తగ్గించవలసింది ఫస్టాఫ్ నుంచి' అని గోపాల్ కి చెప్పాను. దాంతో ఆయన అనుకున్న చోటున ఇంటర్వెల్ బ్యాంగ్ పడటం లేదు. దాంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'ఇంటర్వెల్ బ్యాంగ్ ను బట్టి సినిమాలు ఆడవు .. సెకండాఫ్ ను బట్టి ఆడతాయి' అని నేను చెప్పడంతో ఆయన అంగీకరించాడు. ఫస్టాఫ్ షార్ప్ చేస్తూ వెళ్లి కంటెంట్ ను కరెక్ట్ గా సెట్ చేశాడు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందనేది మీకు తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.     

  • Loading...

More Telugu News