Telangana: అవును.. ప్రణయ్ ను నేనే చంపించా.. పోలీసుల విచారణలో అంగీకరించిన మారుతీరావు!

  • గోల్కొండలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మరికాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు
  • వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే హత్య
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ కుమార్ లను గోల్కొండ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించాడు. ప్రణయ్ ను హత్య చేసేందుకు రూ.10 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాడు.

కాగా, నిందితుడిని పోలీసులు మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రణయ్ హత్య నేపథ్యంలో ఈ రోజు దళిత సంఘాలు మిర్యాలగూడలో బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. బంద్ నేపథ్యంలో నగరంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి.
Telangana
Police
honor killing
arrest

More Telugu News