22 వాయిదాలకు గైర్హాజరైన కారణంగానే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది!: 'బాబ్లీ కేసు'పై కన్నా
- 2013 నుంచి కేసు నడుస్తోంది
- 2016 వరకూ అప్పుడప్పుడు కోర్టుకు హాజరయ్యారు
- 3 సార్లు కోర్టుకు వెళ్లకపోయినా నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది
2013 నుంచి కేసు నడుస్తోందని.. 2016 వరకూ అప్పుడప్పుడు కోర్టుకు హాజరయ్యారని.. చివరి 22 వాయిదాలకు మాత్రం గైర్హాజరైన కారణంగానే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని కన్నా తెలిపారు. సాధారణంగా 3 సార్లు కోర్టుకు వెళ్లకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుందని.. అలాంటిది 22 సార్లు గైర్హాజరయి.. నోటీసులు వస్తే అది మోదీ చేయించారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.