vishnu kumar raju: వారెంట్ వచ్చినంత మాత్రాన.. చంద్రబాబు ప్రతిష్టకు భంగం వాటిల్లదు!: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

  • కొందరు స్వార్థపరులు రాజకీయం చేస్తున్నారు
  • ఆపరేషన్ గరుడలో భాగంగా వారెంట్ వచ్చిందనడం సరికాదు
  • తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి
బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వారెంట్ నేపథ్యంలో, బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడాన్ని కొందరు రాజకీయ స్వార్థపరులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

 చంద్రబాబుకు వారెంట్ వస్తే... ఆపరేషన్ గరుడలో భాగంగా వారెంట్ వచ్చిందంటూ వ్యాఖ్యానిస్తుండటం సరికాదని అన్నారు. ప్రజల తరపున బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు పోరాడారని... నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినంత మాత్రాన... ఆయన ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లదని చెప్పారు. చట్టం తన పనిని తాను చేసుకుపోవడం సహజమేనని... పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.
vishnu kumar raju
Chandrababu
babli project
warrant

More Telugu News