Telangana: కొండగట్టు ప్రమాదంలో మరో ట్విస్ట్.. బస్సుకు ఫిట్ నెస్ ఉందన్న ఆర్డీవో!

  • రోడ్డు ప్రమాదంలో 61కి చేరిన మృతులు
  • మీడియాతో మాట్లాడిన జగిత్యాల ఆర్డీవో
  • ప్రత్యేక బృందం బస్సును చెక్ చేస్తోందని వెల్లడి

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 61 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బస్సుకు ఫిట్ నెస్ లేకపోవడానికి తోడు బ్రేక్స్ ఫెయిల్, స్టీరింగ్ విరిగిపోవడంతో వాహనం లోయలోకి జారిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంపై జగిత్యాల ఆర్డీవో కిషన్ రావ్ కీలక విషయం చెప్పారు. ప్రమాదానికి గురైన జగిత్యాల ఆర్టీసీ బస్సుకు అక్టోబర్ 4 వరకూ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందని కిషన్ రావ్ తెలిపారు. ఈ బస్సును ప్రస్తుతం ప్రత్యేక బృందం తనిఖీ చేస్తోందని చెప్పారు. రెండు రోజుల్లో ఈ కమిటీ విచారణ నివేదికను సమర్పిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News