gautam gambhir: హిజ్రాల వస్త్రధారణలో గౌతమ్ గంభీర్!

  • రాఖీ పండుగ వేళ గంభీర్ నిర్ణయం
  • హిజ్రాలకు మద్దతుగా నిలిచిన క్రికెటర్
  • తప్పుడు అభిప్రాయాన్ని తొలగించేందుకే
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత క్రికెట్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ప్రజా సమస్యలపై తరచూ స్పందిస్తూ ఉంటాడు. కొన్నిరోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లలతో పాటు కశ్మీర్ పోలీస్ రషీద్ కుమార్తె జోహ్రా చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తానని గౌతీ ప్రకటించాడు. తాజాగా సమాజంలో హిజ్రాలపై నెలకొన్న తప్పుడు అభిప్రాయాన్ని తొలగించేందుకు గంభీర్ ముందుకొచ్చాడు.

ఇందులో భాగంగా ఈసారి రాఖీ పండుగను కోల్ కతాలో హిజ్రాలతో కలసి జరుపుకున్న గంభీర్, వారితో రాఖీలను కట్టించుకున్నాడు. హిజ్రాలకు మద్దతుగా వారి తరహాలోనే బొట్టు పెట్టుకుని, చీరను ధరించాడు. ఈ ఫొటోలను తాజాగా గౌతీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

gautam gambhir
higra
rakhi celebrations
kilkata

More Telugu News