renuka chowdary: ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న రేణుకాచౌదరి!

  • ఖమ్మం స్థానం నుంచి బరిలో దిగే యోచన
  • గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచిన పువ్వాడ టీఆర్‌ఎస్‌లో చేరిక
  • ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేణుక ఆలోచన

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకాచౌదరి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన రేణుక త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె సొంత నియోజకవర్గం ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని గాని, హైదరాబాద్‌ నగరంలో సెటిలర్స్‌ అధికంగా ఉండే మరో నియోజకవర్గం నుంచి గాని పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరి ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ తరపున ఇక్కడ పోటీ చేసే సరైన అభ్యర్థి లేకపోవడంతో తానా అవకాశాన్ని వినియోగించుకోవాలని రేణుక ఆలోచనగా తెలుస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచే గతంలో గెలుపొందిన రేణుక మన్మోహన్‌సింగ్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

  • Loading...

More Telugu News