Tirumala: వెంకటేశ్వరుని దివ్య వైభోగం... చిన్న శేషవాహనంపై కనువిందు చేస్తున్న శ్రీనివాసుడు!

  • నేడు రెండో రోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహనం
  • వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

సాలకట్ల బ్రహ్మోత్సవాల రెండో రోజున తిరుమల మాడవీధుల్లో చిన్న శేషవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నారు. నిన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, రాత్రి పెద్ద శేషవాహనంపై కొలువుదీరిన మలయప్ప స్వామి, నేడు ఐదు తలల శేషుడినే వాహనంగా చేసుకుని ఊరేగుతున్నారు. మెల్లమెల్లగా స్వామివారు కదులుతూ తమ ముందుకు వచ్చి దర్శనమిస్తుంటే, వేలాది మంది భక్తులు పులకించి పోతున్నారు. నేటి రాత్రి హంస వాహనంపై ఊరేగింపు జరగనుంది.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ ఈ ఉదయం సాధారణంగా కనిపించింది. స్వామి దర్శనం కోసం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వుండగా, వారికి 5 గంటల సమయం పడుతోంది. దివ్య, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి రూ. 2 కోట్ల హుండీ ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.

More Telugu News