Manohar Parrikar: మళ్లీ ఆసుపత్రిలో చేరిన గోవా సీఎం.. నేతల్లో ఆందోళన!

  • కండోలిమ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన సీఎం
  • ఈ నెల 6నే అమెరికా నుంచి తిరిగి వచ్చిన పారికర్
  • గణేశ్ ఉత్సవాల్లోనూ పాల్గొనని సీఎం
అనారోగ్యం నుంచి కోలుకుని ఇటీవల గోవా తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోమారు అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థతతో బీచ్ విలేజ్ అయిన కండోలిమ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొంది. అయితే, ఇంతకుమించి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరిన విషయం నిజమేనని బీజేపీ నేత మైఖేల్ లోబో పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన మనోహర్ పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈ నెల 6నే ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అంతలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  గణేశ్ చవితి వేడుకల్లోనూ పారికర్ పాల్గొనలేదు.
Manohar Parrikar
Goa
Ganesh Chaturthi
Chief Minister
hospital

More Telugu News