Telugudesam: బాబ్లీ సందర్శన నాటి కేసు: చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్న ధర్మాబాద్ కోర్టు

  • బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన
  • చంద్రబాబును అప్పట్లో అరెస్ట్ చేసిన పోలీసులు
  • త్వరలోనే నోటీసులు అందుకోనున్న టీడీపీ అధినేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబ్లీ డ్యామ్ సందర్శనకు  2010, జూలైలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు వెళ్లారు. తొలుత డ్యామ్ సందర్శనకు అనుమతిస్తామని చెప్పిన పోలీసులు, ఆ తర్వాత చంద్రబాబు సహా పలువురు నాయకులను అరెస్ట్ చేసి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలపై మహారాష్ట్ర పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ఘటనలో టీడీపీ నేతలతో పాటు 76 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బాబ్లీ డ్యామ్ వద్ద ఆందోళనలు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
Telugudesam
Chandrababu
Maharashtra
Andhra Pradesh
BABLI PROJECT
DHARMABAD COURT

More Telugu News