GOPICHAND: టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇంట మరో పండగ.. రెండో బిడ్డకు జన్మనిచ్చిన రేష్మ!

  • ఈరోజు ఉదయం పుట్టిన మరో మగపిల్లాడు
  • 2013లో రేష్మను పెళ్లాడిన హీరో 
  • తొలి తనయుడి వయసు మూడేళ్లు  

వినాయక చవితి పర్వదినం వేళ టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇంట్లో ఆనందాలు రెట్టింపయ్యాయి. గోపీచంద్ భార్య రేష్మ ఈ రోజు ఉదయం పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చారు. ఈ రోజు తెల్లవారుజామున 5.40 గంటలకు బాబు పుట్టినట్లు సమాచారం. ప్రముఖ హీరో శ్రీకాంత్ మేనకోడలైన రేష్మను గోపీచంద్ 2013లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు విరాట్ కృష్ణ (3) ఉన్నాడు.

More Telugu News