warnagal: రాజకీయకక్షలో భాగంగానే నాపై కేసులు: గండ్ర వెంకటరమణారెడ్డి

  • గండ్ర సోదరులపై యర్రబెల్లి రవీందర్ ఫిర్యాదు 
  • నా తమ్ముడిని చంపుతానని బెదిరించారు
  • నా వద్ద, నా సోదరుడి వద్ద వెపన్స్ లేవు
క్రషర్ వ్యాపార లావాదేవీల్లో తేడాల కారణంగా భాగస్వామి యర్రబెల్లి రవీందర్ ఫిర్యాదు మేరకు వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్ రెడ్డిపై నిన్న పోలీస్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి స్పందిస్తూ, రాజకీయ కక్షలో భాగంగానే తనపై పోలీస్ కేసు పెట్టించారని, తన తమ్ముడిని చంపుతానని రవీందర్ రావు బెదిరించారని ఆరోపించారు.

రవీందర్ రావుపై తన తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారని, తన వద్ద, తన సోదరుడి వద్ద వెపన్స్ లేవని, 2015లోనే పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేశామని అన్నారు. తమపై కేసులు నమోదు ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారని, ఈ వ్యవహారంపై డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని గండ్ర కోరారు.
warnagal
gandra venkata ramana reddy

More Telugu News