warangal: గండ్ర సోదరులపై పోలీస్ కేసు నమోదు!

  • క్రషర్ వ్యాపార లావాదేవీల్లో తేడాలు
  • వ్యాపార భాగస్వామి యర్రబెల్లి రవీందర్ పోలీస్ ఫిర్యాదు
  • గండ్ర సోదరులు తనను బెదిరిస్తున్నారని ఆరోపణ
మానవ అక్రమ రవాణా అభియోగాలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేశారు. క్రషర్ వ్యాపార లావాదేవీల్లో తేడాల కారణంగా భాగస్వామి యర్రబెల్లి రవీందర్ వీరిపై శ్యాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండ్ర సోదరులు తనను బెదిరిస్తున్నారని ఈ ఫిర్యాదులో ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు గండ్ర సోదరులపై కేసు నమోదు చేశారు. కాగా, యర్రబెల్లి ఫిర్యాదు నేపథ్యంలో గండ్ర సోదరులు కూడా తిరిగి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
warangal
Congress
gandra venkata rama reddy

More Telugu News