amezon: ఇకపై భారతీయ భాషల్లో కూడా అమెజాన్‌ సేవలు!

  • అత్యధిక శాతం భారతీయులను చేరుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలు 
  • ఈ కామర్స్ మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న సంస్థ
  • హిందీని ప్రవేశపెట్టి కస్టమర్లను ఆకర్షిస్తోన్న అమెజాన్

ఆన్ లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ మరింతగా దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. ఈ-కామర్స్ మార్కెట్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఈ సంస్థ త్వరలో అత్యధిక శాతం భారతీయులను చేరుకునేందుకు తన సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నేటి నుంచి తన సేవలను హిందీలో కూడా ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం అమెరికా 'అమెజాన్' సైట్‌లో ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. అదే తరహాలో ఇండియాలో ఇంగ్లిష్, హిందీని అందుబాటులోకి తెచ్చి కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. భారత్ లో జాతీయ భాష హిందీ అవడం.. అలాగే దేశంలో 50 శాతం మందికి పైగా హిందీ మాట్లాడేవారు ఉండడంతో అమెజాన్ ఇంగ్లిష్ ‌తో పాటు హిందీని కూడా ప్రవేశపెట్టి కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. ఇప్పటికే తమకు 15 కోట్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. తమ సేవలను మరికొన్ని భారతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీలోకి కూడా విస్తరించనున్నట్టు అమెజాన్ ఇండియా సీనియర్ అధికారి కిశోర్ తోట తెలిపారు.

More Telugu News