Petrol: పెట్రోల్ ధర తగ్గించలేం: తమిళనాడు ప్రభుత్వం

  • రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
  • తమిళనాడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనన్న సీఎం 
  • కేంద్ర ప్రభుత్వమే ఎక్సైజ్ సుంకం తగ్గించాలని వినతి

పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21కి పైగా విపక్ష పార్టీలు సోమవారం భారత్ బంద్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై అదనపు వ్యాట్ ను రూ.2 మేర తగ్గించింది.

ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలపై అమ్మకం పన్ను తగ్గించే స్తోమత తమకు లేదని తేల్చి చెప్పారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, సేల్స్ టాక్స్ తగ్గించే స్థితిలో తాము లేమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కోరారు.

More Telugu News